అప్పుల భారం.. ఎండిన వరి పంట.. రైతు ఆత్మహత్య
- ఎఫ్పీఓల్లో చేరితే రైతులకు అధిక లాభాలు - October 24, 2026
- పీర్మాయ కుంట తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం - October 24, 2026
- అప్పుల భారం.. ఎండిన వరి పంట.. రైతు ఆత్మహత్య - October 24, 2026
తాడ్వాయి: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి రమేశ్ (38) తన పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. అప్పుల భారం, ఎండల తీవ్రతకు నీరు అందక వరి పంట ఎండిపోవడం, పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై నరేశ్, ఏఎస్సై కొండల్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

