Category: జిల్లా వార్తలు

చెక్క బతుకమ్మ వెనుక తరతరాల అనుబంధం!

నాగర్ కర్నూల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో చెక్క బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది.తొలిసారి బతుకమ్మ పండుగ జరుపుకునే ఆడపిల్లలకు,వివాహం అనంతరం తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు చెక్క బతుకమ్మను అందించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా అమ్మమ్మలు తమ మనవరాళ్లకు చెక్క బతుకమ్మతో పాటు పట్టు వస్త్రాలు, పిండి వంటలు, స్వీట్లు అందించి ఆశీర్వదిస్తారు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. కుటుంబంలోని పెద్దల ప్రేమకు, ఆడపడుచుల ఆత్మీయతకు, తరతరాలుగా కొనసాగుతున్న…

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల పరిధిలో చీమలదరి గ్రామంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు , యువతులు రంగు రంగుల పూలతో బతుకమ్మ లను అందంగా అలంకరించి సంప్రదాయ బద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ  పండుగను గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య  జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ లను ఆడుతూ పాడుతూ వేడుకలను సందడిగా నిర్వహించారు.

బొల్లంపల్లిలో భక్తి పారవశ్యం..వైభవంగా దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు

వెల్దండ, అక్టోబర్ 18: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి దేవాలయంలో,పాత బావి సమీపంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రత్యేక పూజల్లో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి,మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జీయాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం అన్నదాతలు…

జనగామ పట్టణంలో ప్రశాంతంగా బతుకమ్మ సంబరాలు – సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

జనగామ పట్టణంలో ప్రశాంతంగా బతుకమ్మ సంబరాలు – సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు.

చీమలదరి ప్రీమియం లీగ్ (సిపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ లో  సత్తాచాటిన లెవెన్ టీమ్ సభ్యులు

వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో ఆదివారం చీమలదరి ప్రీమియం లీగ్ వన్ డే  క్రికెట్  టోర్నమెంట్  అరుణా రెడ్డి   ఆధ్వర్యంలో నిర్వహించారు  ఈ టోర్నమెంట్ కి    ముఖ్య అతిథిగా  సర్పంచ్  కల్పన హరీష్ కుమార్ రెడ్డి  గారు హాజరై మొదటగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ఆరంభించారు.  ఈ సందర్బంగా సర్పంచ్  మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంపోందిచుకోవాలని సూచించారు.క్రీడల వల్ల మేధాశక్తిని  పెంచుకోవడం ,మానసిక ఒత్తిడిని తగ్గించు కోవచ్చని .ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతాయని ,  మానసిక ఉల్లాసాన్ని, శారీరకదృఢత్వాన్ని,  పెంపోందిస్తాయని, క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్…

సింగాపురం బైపాస్‌ రోడ్డు లో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం బైపాస్‌ రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య అలియాస్‌ బేగరి మొగులయ్య (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో...

ఎస్సీ రోస్టర్‌లో మాలలకు అన్యాయం: అయ్యాల సంతోష్

ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం వల్ల మాలలకు విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాల సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోస్టర్‌లో మాలలకు 10వ పాయింట్‌లోపు కేటాయించాలని, విధానాన్ని సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించి,…

కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్ షెట్కార్

బాన్సువాడ కోటగల్లిలోని శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, పత్తి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

లింగారెడ్డిపల్లిలో ఘనంగా LPL-5వ సీజన్ ప్రారంభం

వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ (LPL) 5వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ నిర్వాహకులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మైలా అల్వాల్ రెడ్డి గారు, మైలా హాన్మంత్ రెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సర్పంచ్ ల సంఘం…