ఎస్సీ రోస్టర్‌లో మాలలకు అన్యాయం: అయ్యాల సంతోష్

ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం వల్ల మాలలకు విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల సంఘం తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యాల సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రోస్టర్‌లో మాలలకు 10వ పాయింట్‌లోపు కేటాయించాలని, విధానాన్ని సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు అందించాలని మాల సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

You may also like...