సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పల్లా దంపతుల సందడి.
- సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే పల్లా దంపతుల సందడి. - October 19, 2026
- జనగామ పట్టణంలో ప్రశాంతంగా బతుకమ్మ సంబరాలు – సహకరించిన ప్రజాప్రతినిధులు, ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కృతజ్ఞతలు. - October 19, 2026
- జ్యోతి నగర్ జీఎంఆర్ కాలనీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు - October 11, 2026

జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సతీమణి నీలిమతో కలిసి పాల్గొన్నారు. మహిళలతో మమేకమైన ఎమ్మెల్యే దంపతులు బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ సందడి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళల ఆత్మీయతకు, ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పూల పండుగ వైభవాన్ని భావితరాలకు అందించాలని, తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
