ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు - October 19, 2026
- చీమలదరి ప్రీమియం లీగ్ (సిపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ లో సత్తాచాటిన లెవెన్ టీమ్ సభ్యులు - October 19, 2026
- చీమలదరి లో ఉచిత వైద్య శిబిరం - October 12, 2026
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల పరిధిలో చీమలదరి గ్రామంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు , యువతులు రంగు రంగుల పూలతో బతుకమ్మ లను అందంగా అలంకరించి సంప్రదాయ బద్దంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ లను ఆడుతూ పాడుతూ వేడుకలను సందడిగా నిర్వహించారు.

