చీమలదరి ప్రీమియం లీగ్ (సిపిఎల్) క్రికెట్ టోర్నమెంట్ లో  సత్తాచాటిన లెవెన్ టీమ్ సభ్యులు

వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో ఆదివారం చీమలదరి ప్రీమియం లీగ్ వన్ డే  క్రికెట్  టోర్నమెంట్  అరుణా రెడ్డి   ఆధ్వర్యంలో నిర్వహించారు  ఈ టోర్నమెంట్ కి    ముఖ్య అతిథిగా  సర్పంచ్  కల్పన హరీష్ కుమార్ రెడ్డి  గారు హాజరై మొదటగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ ను ఆరంభించారు.  ఈ సందర్బంగా సర్పంచ్  మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంపోందిచుకోవాలని సూచించారు.క్రీడల వల్ల మేధాశక్తిని  పెంచుకోవడం ,మానసిక ఒత్తిడిని తగ్గించు కోవచ్చని .ఆరోగ్యానికి ఎంతో దోహద పడుతాయని ,  మానసిక ఉల్లాసాన్ని, శారీరకదృఢత్వాన్ని,  పెంపోందిస్తాయని, క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని క్రీడలను అలవార్చుకోవాలని అన్నారు          

ఇరు జట్ల మధ్య హోరా హోరీగా సాగిన  ఈ మ్యాచ్  గెలిచిన జట్టుకు బహుమతి ప్రదానం చేశారు  మొదటి బహుమతి ఇరవై రెండు వేల రూపాయలు, రన్నర్ బహుమతి పదకొండు వేల రూపాయలు అందజేశారు.ఈ పోటీలో గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

You may also like...