సింగాపురం బైపాస్‌ రోడ్డు లో ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగాపురం బైపాస్‌ రోడ్డుపై ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య అలియాస్‌ బేగరి మొగులయ్య (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో ఆయన తలపై నుంచి వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి గ్లామర్ బైక్‌ నంబర్‌ TS 07 HA 6338. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like...