లింగారెడ్డిపల్లిలో ఘనంగా LPL-5వ సీజన్ ప్రారంభం
- లింగారెడ్డిపల్లిలో ఘనంగా LPL-5వ సీజన్ ప్రారంభం - October 18, 2026
- నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో రెవెన్యూ రీ-సర్వే పనుల పరిశీలన - October 9, 2026
- రాహుల్ గాంధీ పిలుపు మేరకు రేపు మహేశ్వరంలో OBC భారీ సభ - October 4, 2026
వెల్దండ: వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని లింగారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ (LPL) 5వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది.
గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీ నిర్వాహకులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మైలా అల్వాల్ రెడ్డి గారు, మైలా హాన్మంత్ రెడ్డి గారు, గ్రామ ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదిప్ రెడ్డి గారు, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాయితి విజయ్ కుమార్ రెడ్డి, గౌరవనీయులు పెద్దలు సాయిరెడ్డి గారు .జెపల్లి గ్రామ సర్పంచ్ అశోక్ గారు, జూపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బాలరాజు గారు హాజరయ్యారు.
ముందుగా అతిథులు క్రీడాకారులకు టీషర్టులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కాయితి ఆశాదిప్ రెడ్డి గారు టాస్ వేసి మొదటి మ్యాచ్ ను లాంఛనంగా ప్రారంభించారు.మొదటి మ్యాచ్ టైగర్ టైటాన్స్ మరియు పవర్ హిట్టర్స్ జట్ల మధ్య జరుగుతుంది.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు జట్ల కెప్టెన్ లు సంతోష్ , విజయ్ ,శోభన్ బాబు, శ్రీధర్ మరియు క్రీడాకారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, గ్రామ ఐక్యతను చాటేందుకు ప్రతి ఏటా LPL ను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ మహ్మద్ అన్వర్ పాషా తెలిపారు.
