Category: జిల్లా వార్తలు

కస్తూర్బా పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు పరార్…

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని కస్తూర్బా గాంధీ పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు వెళ్లిపోయారు. తరగతి గదిలో హాజరు తీసుకుంటుండగా వారు కనిపించకపోవడంతో హెచ్ఎం గీత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై భార్గవ్ గౌడ్ విచారణ చేపట్టి బస్సులో వెళ్తున్న విద్యార్థినులను గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని వారు చెప్పడంతో తల్లిదండ్రులకు అప్పగించారు.

ఉపాధ్యాయులు సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్

ఉపాధ్యాయులు సమాజానికి దిశా నిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలి : మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి: మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్ లో టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభలు ప్రారంభంకట్టంగూర్, నవంబర్ 1: ఉపాధ్యాయులు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలనే బోధించే వారిగా కాకుండా సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదగాలని మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ నాగేశ్వర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎన్ యూటీఎఫ్)…

స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేతజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ : అనారోగ్యంతో మృతిచెందిన తమ తోటి విద్యార్థి కుటుంబానికి ఆర్ధికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు కట్టంగూర్ ఆదర్శ గురుకుల విద్యాలయ 2004-05 పదో టెన్త్ బ్యాచ్ విద్యార్థులు. పాఠశాలలో చదువుకున్న నల్లగొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పూర్వ ప్రిన్సిపాల్ కొంక ప్రవీణ్, కరస్పాండెంట్ బుడిగ సైదులు స్పందించి విద్యార్థులు, ఇతర దాతల సహాకారంతో రూ.65,300 సేకరించారు….

ప్లాటినం ఐకాన్ అవార్డు గ్రహీత లక్ష్మయ్యకు సన్మానం

ప్లాటినం ఐకాన్ అవార్డు గ్రహీత లక్ష్మయ్యకు సన్మానంజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ : మండల కేంద్రంలోని శ్రీసాయి మణికంఠ ఆలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూలస్వామి) ఇటీవల న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ప్లాటినం ఐకాన్ అవార్డు అందుకున్నాడు. ఆదివారం మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన గురుస్వామి గండమల్ల అంతయ్య ఆధ్వర్యంలో లక్ష్మయ్య నివాసానికి వెళ్లిన గురుస్వాములు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అంతయ్య మాట్లాడుతూ లక్ష్మయ్య ప్లాటినం అవార్డు అందుకోవడం అభానందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన…

బాలల భద్రతపై విద్యార్థులకు అవగాహన

సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా శనివారం కొత్తబాది కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు నేర చట్టాలు, బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ బాన్సువాడ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ సాయిబాబు మాట్లాడుతూ పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, గుడ్ టచ్‌–బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, వ్యక్తిగత భద్రతపై విద్యార్థులకు వివరించారు. ఆపదలో ఉన్న బాలలు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో…

ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్

నాగర్ కర్నూల్, అక్టోబర్ 31:అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఉప్పునుంతల తహసీల్దార్ ఎ.సునీతను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సస్పెండ్ చేశారు.అయ్యవారిపల్లి సర్వే నం.115 లోని 13 ఎకరాల 17 గుంటల భూమి రికార్డుల్లో అవకతవకలపై విచారణ జరిపిన సబ్ కలెక్టర్ సలోని చాబ్రా నివేదికలో పత్రాల ధృవీకరణలో లోపాలు,విధుల్లో వైఫల్యం తేలింది.దీంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారు.

చేవెళ్ల ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి: పట్టుబడిన ఐసీఎఫ్‌ఏఐ, ఐబీఎస్ విద్యార్థులు

ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సేవిస్తున్న ఐసీఎఫ్‌ఏఐ (ICFAI), ఐబీఎస్ (IBS) కళాశాలలకు చెందిన 108 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సాంబార్లో గండు చీమ.. ఉడిపి గ్రాండ్ నిర్లక్ష్యం!

జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి(వెబ్ డెస్క్): రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం బీడీల్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఉడిపి గ్రాండ్ హోటల్‌లో అపరిశుభ్రత వెలుగుచూసింది. కస్టమర్ వడ తింటూ టిఫిన్ చేస్తుండగా సాంబార్‌లో గండు చీమ కనిపించడంతో విస్తుపోయారు. హోటల్‌లో ఆహార తయారీ, పరిశుభ్రత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి....

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారిపై కారులో ఘోర అగ్నిప్రమాదం; తప్పిన పెద్ద ముప్పు

శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై శుక్రవారం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి