బుర్రిపాలెం పంచాయతీ ఏకగ్రీవం సర్పంచ్‌గా జెట్టి భారతి

435259.png

గుంటూరు : తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామపంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యారు తెలుగుదేశం పార్టీ కూటమి మద్దతుతో సర్పంచ్ పదవికి బరిలో నిలిచిన జెట్టి భారతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. గ్రామంలోని ఒక సర్పంచ్ స్థానానికి ఐదుగురు, ఏడు వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, చివరి నిమిషంలో గ్రామ పెద్దలు మరియు నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో జెట్టి భారతి ఎన్నిక ఏకగ్రీవమైంది.

You may also like...