ప్లాటినం ఐకాన్ అవార్డు గ్రహీత లక్ష్మయ్యకు సన్మానం

ప్లాటినం ఐకాన్ అవార్డు గ్రహీత లక్ష్మయ్యకు సన్మానం

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ : మండల కేంద్రంలోని శ్రీసాయి మణికంఠ ఆలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూలస్వామి) ఇటీవల న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక ప్లాటినం ఐకాన్ అవార్డు అందుకున్నాడు. ఆదివారం మండలంలోని కురుమర్తి గ్రామానికి చెందిన గురుస్వామి గండమల్ల అంతయ్య ఆధ్వర్యంలో లక్ష్మయ్య నివాసానికి వెళ్లిన గురుస్వాములు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా అంతయ్య మాట్లాడుతూ లక్ష్మయ్య ప్లాటినం అవార్డు అందుకోవడం అభానందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పురష్కారాలు అందుకోవాలన్నారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో జానపాటి రవి. పొడిచేటి సైదులు, గడగోజు జగనాచారి, తన్నీరు అంజి తదితరులు ఉన్నారు.

You may also like...