స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

స్నేహితుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ : అనారోగ్యంతో మృతిచెందిన తమ తోటి విద్యార్థి కుటుంబానికి ఆర్ధికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు కట్టంగూర్ ఆదర్శ గురుకుల విద్యాలయ 2004-05 పదో టెన్త్ బ్యాచ్ విద్యార్థులు. పాఠశాలలో చదువుకున్న నల్లగొండ మండలం దండంపల్లి గ్రామానికి చెందిన మల్లెబోయిన వెంకన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పూర్వ ప్రిన్సిపాల్ కొంక ప్రవీణ్, కరస్పాండెంట్ బుడిగ సైదులు స్పందించి విద్యార్థులు, ఇతర దాతల సహాకారంతో రూ.65,300 సేకరించారు. సేకరించిన మొత్తాన్ని ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అందజేశారు. ఆర్ధికసాయం అందజేసిన వారిలో కొంక ప్రవీణ్, పోగుల శ్రీను, మల్లెబోయిన శ్రీను ఉన్నారు.

You may also like...