చేవెళ్ల ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి: పట్టుబడిన ఐసీఎఫ్‌ఏఐ, ఐబీఎస్ విద్యార్థులు

369490.png

రంగారెడ్డి : చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మేట గ్రామంలో గల ఎల్‌జీ ఫామ్‌హౌస్‌పై శుక్రవారం (అక్టోబర్ 30) పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సేవిస్తున్న ఐసీఎఫ్‌ఏఐ (ICFAI), ఐబీఎస్ (IBS) కళాశాలలకు చెందిన 108 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నమ్మదగిన సమాచారం మేరకు స్పందించిన పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఫామ్‌హౌస్‌లో మొత్తం 71 మంది యువకులు, 37 మంది యువతులు ఉన్నట్లు గుర్తించారు.

నలుగురికి డ్రగ్స్ పాజిటివ్:

దాడి సమయంలో పోలీసులు విద్యార్థులకు డ్రగ్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు గంజాయి (క్యానబిస్) సేవించినట్లు నిర్ధారణ అయింది. నిబంధనలు ఉల్లంఘించి పార్టీ నిర్వహించడంపై

చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు. చట్టప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు369489.jpg369491.png

You may also like...