అభినవ పూలేగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్
- ఖేలో ఇండియా-2026 జాతీయ క్రీడల నిర్వహణకు కీలక నిర్ణయాలు - November 4, 2026
- కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకోవాలి. - November 4, 2026
- నవంబర్ 6న కామారెడ్డిలో శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు - November 4, 2026
తాడ్వాయి: ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆశయ సాధన దిశగా విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును అభినవ పూలేగా అభివర్ణిస్తూ తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో వివిధ పాఠశాలల అభివృద్ధికి నాబార్డ్ నిధుల ద్వారా రూ.2.57 కోట్ల నిధులు మంజూరయ్యేలా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి చేయడం అభినందనీయమన్నారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల వసతి గృహానికి సీసీ రోడ్ల నిర్మాణం, మండల ప్రజలు, విద్యార్థుల రవాణా సౌకర్యార్థం బీటీ రోడ్ల రీటెండర్కు అనుమతులు తీసుకురావడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. అంతేకాకుండా పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య చికిత్సల నిమిత్తం అందించే ఎల్ఓసీలు, సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని పారదర్శకంగా, అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే చేరేలా కృషి చేయడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, విద్యా, వైద్య, రహదారుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సేవలు భవిష్యత్తు నాయకులకు ఆదర్శప్రాయమని రాజీవ్ కుమార్ ప్రశంసించారు.
