Category: జిల్లా వార్తలు

పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్/కల్వకుర్తి: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ఆమనగల్, కల్వకుర్తి పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమనగల్ పట్టణంలోని విటాయిపల్లి పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.తదుపరి కల్వకుర్తి పట్టణంలో మాజీ సర్పంచ్ దామోదర్ గౌడ్‌కు చెందిన సుధా చికెన్ షాప్‌తో పాటు తాండ గేట్ సమీపంలోని నూతన పెట్రోల్…

మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర ప్రసూతి సేవలు, శస్త్రచికిత్స సదుపాయాలు, రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్యంపై ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మాతృ మరణాల సమీక్షలో గుర్తించిన లోపాలను నిర్దిష్ట గడువులోగా సరిదిద్దాలని స్పష్టం చేశారు. తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ…

వడ్డెర భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలి

హైదరాబాద్‌లో వడ్డెర ఆత్మభవనం, విద్యార్థుల వసతిగృహం, సంఘం భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.ఉప్పల్ భగాయత్‌లో వడ్డెర ఆత్మభవనం కోసం గతంలో ఒక ఎకరం స్థలం, అత్తాపూర్‌లో విద్యార్థుల వసతిగృహం, సంఘం భవన నిర్మాణాల కోసం 650 గజాల స్థలం కేటాయించినప్పటికీ నిధులు విడుదల కాక పనులు ప్రారంభం కాలేదని…

కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకోవాలి.

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పై అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ జీవియం విఠల్ డిమాండ్ చేశారు.వైద్య విద్యను అభ్యసించేందుకు కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను వేధించడం, మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదన్నారు. ర్యాగింగ్‌ను…

నవంబర్ 6న కామారెడ్డిలో శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలు

కామారెడ్డి: ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ శుక్రవారం శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. గత 33 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాలో కీర్తిశేషులు పోలీస్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారని, అదే…

ఎమ్మార్పీఎస్‌లో నాయకత్వ లోపం.. స్వలాభాల కోసమే సంఘాన్ని వాడుకుంటున్నారు!

ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) పేరుతో జిల్లాలో ఎన్ని అనుబంధ సంఘాలు పనిచేస్తున్నాయి? వాటి నాయకులు మాదిగ సమాజ అభ్యున్నతి కోసం ఏం చేస్తున్నారు? అంటూ కామారెడ్డి జిల్లా మాదిగ మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు సట్టిగారి బుజ్జమ్మ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంపై నమ్మకంతో, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్‌లో చేరానని బుజ్జమ్మ తెలిపారు. అయితే…

పట్టభద్రుల ఓటు పై కాంగ్రెస్ దృష్టి.. కాంగ్రెస్ కే పట్టం కట్టాలని హరికిషన్ పిలుపు

వెల్దండ నవంబర్ 04 : ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సోమ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్దండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూడవత్ హరికిషన్ నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం వెల్దండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. యువత, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో…

హెల్మెట్ లేకుండా ప్రయాణం వద్దు.. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే!- వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి

వెల్దండ,నవంబర్ 4: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి సూచించారు. బుధవారం వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 765 పై ఆయన ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన…

ప్రజారోగ్యంలో పారిశుధ్యానిదే కీలకపాత్ర: సర్పంచ్ శ్రీనివాసులు

వెల్దండ, నవంబర్ 4: ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్యం కీలకమని చేర్కూర్ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రధాన వీధులు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బందితో తొలగించారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా, పంచాయతీ ట్రాక్టర్‌కు అందించి పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు లాలయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

అసంపూర్తి ఇంటి నిర్మాణానికి 5 వేల ఇటుకల అందజేత

వెల్దండ: మండలంలోని అజిలాపూర్ గ్రామానికి చెందిన కేషమోని కౌసల్య–లక్ష్మయ్య దంపతుల ఇంటి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 వేల ఇటుకలను అందజేశారు. ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో ఈ ఇటుకలను అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్ధగొని రమేష్ గౌడ్, 4వ వార్డు సభ్యుడు గోరంట్ల రమేష్, బీఆర్ఎస్ నాయకులు కొప్పుల రవికుమార్, వరికుప్పల ప్రశాంత్, సాల్వది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.