నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
- ప్రజారోగ్యంలో పారిశుధ్యానిదే కీలకపాత్ర: సర్పంచ్ శ్రీనివాసులు - November 4, 2026
- అసంపూర్తి ఇంటి నిర్మాణానికి 5 వేల ఇటుకల అందజేత - November 4, 2026
- రోడ్డు ప్రమాదంలో హెచ్ఎం భూపతి దాస్ మృతి.. సర్పంచ్ ఘన నివాళి - November 4, 2026

నాగర్‌కర్నూల్ నవంబర్ 04: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందజేశారు.జిల్లాలోని బీసీ విద్యార్థులకు టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, డీఎస్సీ, టెట్, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా నాణ్యమైన శిక్షణ అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కోచింగ్ కేంద్రం లేకపోవడంతో పేద విద్యార్థులు హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.స్టడీ సర్కిల్ ఏర్పాటుకు జిల్లా కార్యాలయాల సముదాయంలో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భవనాన్ని గుర్తించినట్లు తెలిపారు. అందులో రెండు స్టడీ హాళ్లు, నాలుగు గదులతో పాటు మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. శాశ్వత భవనం నిర్మించే వరకు ఈ భవనంలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని సూచించారు.స్టడీ సర్కిల్ ఏర్పాటుకు తక్షణ అనుమతులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన నిధులు, బోధనా సిబ్బందిని కేటాయించాలని మంత్రిని కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ స్థానికంగానే అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.
