చంద్రకళ పార్థివదేహానికి నివాళులర్పించిన డా. విశారదన్ మహారాజ్

1001325792.jpg

షాద్ నగర్: కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ రెండో సంవత్సరం చదువుతున్న డక్కలి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థిని డాకూరి చంద్రకళ ఆత్మహత్య ఘటనపై ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డా. విశారదన్ మహారాజ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై గతంలో విశ్వవిద్యాలయ ఉపకులపతితో ఫోన్‌లో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు.మంగళవారం (నవంబర్ 3) షాద్‌నగర్‌లో చంద్రకళ పార్థివదేహానికి నివాళులర్పించిన ఆయన, బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

You may also like...