AISA తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌గా కామారెడ్డి జిల్లా విద్యార్థి నాయకుడు జీవియం విఠల్ ఎన్నిక
- దోమకొండ గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినులకు పోలీసుల అవగాహన కార్యక్రమం - November 3, 2026
- అభినవ పూలేగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ - November 3, 2026
- ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.30 వేల పరిహారం చెల్లించాలి సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్ - November 3, 2026
కామారెడ్డి: ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తెలంగాణ రాష్ట్రస్థాయి సమావేశంలో కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జీవియం విఠల్ రాష్ట్ర కో-కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యార్థుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, అందరికీ సమాన విద్యా అవకాశాల కల్పన తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జీవియం విఠల్ రాష్ట్రస్థాయి బాధ్యతలకు ఎన్నిక కావడం పట్ల AISA కామారెడ్డి జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జీవియం విఠల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర కో-కన్వీనర్ బాధ్యతలు అప్పగించిన AISA నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని AISA కామారెడ్డి జిల్లా కమిటీ నాయకులు తెలిపారు.
