దళిత నేతకు దక్కాలి మార్కెట్‌ పీఠం!.. మెకానిక్ బాబా- గోల్డ్ రాము

1001325861.jpg

ఆమనగల్ నవంబర్ 03: ఆమనగల్లు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని ఈసారి దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్‌ బాబా, వస్పుల జంగయ్య మిత్ర మండలి అధ్యక్షుడు గోల్డ్‌ రాము ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కోరారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సీనియర్‌ నాయకుడు వస్పుల జంగయ్యకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.మంగళవారం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవీకాలం నవంబర్‌ 22తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి నియామకంలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జంగయ్య గతంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, డీసీసీ ఉపాధ్యక్షుడిగా, పీసీసీ సభ్యుడిగా, గ్రంథాలయ డైరెక్టర్‌గా పనిచేశారని తెలిపారు.గత 12 ఏళ్లుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి అనుచరుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీ సేవలు, సీనియారిటీ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని జంగయ్యకు అవకాశం కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు.

You may also like...