వడ్డెర భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలి
- మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: కలెక్టర్ - November 4, 2026
- వడ్డెర భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలి - November 4, 2026
- బాలకృష్ణకు జిగ్రీ మిత్రుల ఘన సన్మానం - November 4, 2026

హైదరాబాద్‌లో వడ్డెర ఆత్మభవనం, విద్యార్థుల వసతిగృహం, సంఘం భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రాలు సమర్పించారు.ఉప్పల్ భగాయత్‌లో వడ్డెర ఆత్మభవనం కోసం గతంలో ఒక ఎకరం స్థలం, అత్తాపూర్‌లో విద్యార్థుల వసతిగృహం, సంఘం భవన నిర్మాణాల కోసం 650 గజాల స్థలం కేటాయించినప్పటికీ నిధులు విడుదల కాక పనులు ప్రారంభం కాలేదని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ భవనాలు వడ్డెర సామాజిక వర్గ అభ్యున్నతికి, విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంజ ఆంజనేయులు, గోగుల రమేష్, కోడగంటి కృష్ణ, గోగుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
