ప్రజారోగ్యంలో పారిశుధ్యానిదే కీలకపాత్ర: సర్పంచ్ శ్రీనివాసులు

1001327334.jpg

వెల్దండ, నవంబర్ 4: ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుధ్యం కీలకమని చేర్కూర్ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు బుధవారం ఆయన ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ప్రధాన వీధులు, కాలనీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బందితో తొలగించారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా, పంచాయతీ ట్రాక్టర్‌కు అందించి పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు లాలయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

You may also like...