పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

1001328587.jpg

ఆమనగల్/కల్వకుర్తి: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం ఆమనగల్, కల్వకుర్తి పట్టణాల్లో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమనగల్ పట్టణంలోని విటాయిపల్లి పరిధిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.తదుపరి కల్వకుర్తి పట్టణంలో మాజీ సర్పంచ్ దామోదర్ గౌడ్‌కు చెందిన సుధా చికెన్ షాప్‌తో పాటు తాండ గేట్ సమీపంలోని నూతన పెట్రోల్ బంకును ప్రారంభించారు.అనంతరం అడ్వకేట్ అమరేందర్ తల్లి అండాలమ్మ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిపోర్టర్ శేఖర్‌ను యెన్నం ఆసుపత్రిలో, అనంతరం ఆయన నివాసంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

You may also like...