లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు.. పీఏసీఎస్ చైర్మన్లకు నియామక ఉత్తర్వులు

1001331453.jpg

వెల్దండ,నవంబర్ 05 : కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులు, వైద్య ఖర్చుల కోసం ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నూతనంగా నియమితులైన చైర్మన్లు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. కల్వకుర్తి మండలానికి చెందిన రఘుపతిపేట హరీష్‌రెడ్డి, ఆమనగల్ మండలానికి చెందిన కడ్తాల్ గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, వెల్దండ మండలానికి చెందిన ఎన్నం భూపతిరెడ్డికి నియామక ఉత్తర్వుల కాపీలను ఎమ్మెల్యే అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు సకాలంలో అందేలా చైర్మన్లు కృషి చేయాలని సూచించారు. సహకార సంఘాల నిర్వహణలో పారదర్శకత పాటించాలని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామని నూతన చైర్మన్లు పేర్కొన్నారు.

You may also like...