ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5 : ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ న్స్ను గురువారం తాసీల్దార్ పుష్పలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియపై ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ సంప్రదించి వివరాలు తెలుకోవచ్చని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ చేపడుతున్నామని, అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీటీ అల్బట్ ప్రాంక్లిన్, ఆర్ఎఐ రామారావు, జూనియర్ అసిస్టెంట్ భాగ్య, సిబ్బంది అరవింద్, జీపీఓలు పాల్గొన్నారు.

You may also like...