జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు దుగినవెల్లి విద్యార్థి ఎంపిక మారుమూల గ్రామం నుంచి ప్రతిభ చాటిన గోపాలకృష్ణ

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 5: జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో మండలంలోని దుగినవెల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ప్రతిభ చాటాడు. తిరుమలగిరి సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌-14 వాలీబాల్ పోటీల్లో దుగినవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఏనుగుల గోపాలకృష్ణ ప్రతిభ కనబరిచి నల్గొండ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థి గోపాలకృష్ణతో పాటు అతనికి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు అయితగోని సైదులును అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ క్రీడల్లో జిల్లా స్థాయికి ఎదగడం పట్ల దుగ్గినెళ్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

You may also like...