Category: జిల్లా వార్తలు

అక్రమ బోర్లు రహదారుల కబ్జాపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ

చెరువుల చెంత అక్రమ బోర్లు.. రహదారుల ఆక్రమణలు హైడ్రా ప్రజావాణికి 36 ఫిర్యాదులు హైదరాబాద్: నగర పరిధిలో చెరువుల ఆక్రమణలు, అక్రమ బోర్లు, రహదారుల కబ్జాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 36 ఫిర్యాదులు అందాయి. వీటిలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, రహదారుల కబ్జాలు ప్రధానంగా ఉన్నాయి. చెరువుల సమీపంలో అక్రమంగా బోర్లు ఏర్పాటు చేసి, రాత్రి వేళల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించి విక్రయిస్తున్నారని స్థానికులు…

పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..!

వెల్దండ, నవంబర్ 09 :వెల్దండ మండల సింగిల్ విండో పీఏసీఎస్ వైస్ చైర్మన్ గా నియమితులైన బాణావత్ శంకర్ నాయక్ ను ఘనంగా సన్మానించారు.ఉమ్మడి చెదురుపల్లి గ్రామపంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీటీసీ గా పోటీ చేసిన వర్త్య సుశీల బాయ్ కుటుంబ సభ్యులు ఈరోజు ఆయనను కలిసి శాలువాతో సన్మానించి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో వైస్ చైర్మన్ గా నియమించిన నాయకులకు,…

కాంగ్రెస్ సీనియర్ నాయకున్నీ పరామర్శించిన బండి రమేష్

అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు బండి రమేష్ పరామర్శకూకట్‌పల్లి: అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ సోమవారం పరామర్శించారు. ఇటీవల గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడిన పార్టీ సీనియర్ నాయకులు పొడుగు అప్పారావు, సాయిబాబా చౌదరి చికిత్స పొందిన అనంతరం తమ స్వగృహాలకు చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న బండి రమేష్ వారి నివాసాలకు వెళ్లి ఇరువురు నాయకులను,…

బోడుప్పల్లో ఘనంగా సదర్ సమ్మేళనం

*బోడుప్పల్‌లో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్*మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, బోడుప్పల్ డివిజన్‌లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం…

ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య

ఆమనగల్, నవంబర్ 09: ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో కోడిగని లింగం–చంద్రయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చి ఇబ్లబందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి, వార్డు సభ్యులు చిన్న…

వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, రుణాలు మంజూరు చేయాలి ప్రతి వార్డులో వెండింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు గాజులరామారం: గాజులరామారం సర్కిల్ కార్యాలయంలో సోమవారం టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట రాములు మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో కొత్తగా వీధి వ్యాపారులను గుర్తించి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే అర్హత కలిగిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక…

రాష్ట్రంలో 22 జిల్లాల మహిళా అధ్యక్షుల ప్రకటన

తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీ, 22 జిల్లాల అధ్యక్షుల ప్రకటనహైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీతో పాటు 22 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లంబా ఆమోదంతో ఈ నూతన కమిటీని ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం,…

హైకోర్టు ఆదేశాలు అమలులో జాప్యంకు కలెక్టర్పై చర్యలు

*రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు**పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల పాటు శిక్ష నిలిపివేత* హైకోర్టు ఆదేశాలను అమలు చేయని వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.వివరాల్లోకి వెళ్తే.. నిషేధిత…

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి ఇంట్లో చోరీ…

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి.. ఇంట్లో చోరీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని శిల్పా వ్యాలీ సారా ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 2న రాత్రి టెర్రస్ నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి ప్రవేశించి 35 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 8న గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడు…

తెలంగాణ రక్షణ సేనలోకి ఇద్దరు యువ నాయకులు.. ఘనంగా పార్టీలో చేరికలు!

హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలోకి ఇద్దరు యువ నాయకులు చేరారు. నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు రఘు ముదిరాజ్, ఎల్లారెడ్డి మండలానికి చెందిన సంతోష్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని నూతనంగా పార్టీలో చేరిన నాయకులు తెలిపారు….