బోడుప్పల్లో ఘనంగా సదర్ సమ్మేళనం

*బోడుప్పల్‌లో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్*

మేడ్చల్–మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, బోడుప్పల్ డివిజన్‌లో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళనానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు, పెద్దలు, యువకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఐక్యత, సోదరభావాన్ని చాటుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, సంఘం పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...