రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) ఝరాసంగం (సంగారెడ్డి జిల్లా): మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మొహమ్మద్ షరీఫ్ తన చేతుల మీదుగా లబ్ధిదారులకు కొత్త కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కాంచన, జీబీపీ పరమేశ్వర్, సిద్ధాపూర్ ఐకేపీ వీవోఏ రామిరెడ్డి, ఉప సర్పంచ్ ఇమ్ము, మాజీ సర్పంచ్ అంజమ్మ, గ్రామ పెద్దలు షేకర్, వీరారెడ్డి, హుస్సేన్ మౌలానా, మొయిజ్, యాదులు తదితరులు పాల్గొన్నారు.