ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య
- పీఏసీస్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కు ఘన సన్మానం..! - November 9, 2026
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026
- కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..! - November 9, 2026
ఆమనగల్, నవంబర్ 09: ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో సర్పంచ్ వెంకటయ్య ఆధ్వర్యంలో కోడిగని లింగం–చంద్రయ్య దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంట్లో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చి ఇబ్లబందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి, వార్డు సభ్యులు చిన్న జంగయ్య, అలివేలు, కార్యదర్శి దేవేందర్, కమిటీ సభ్యుడు శేఖర్, రాములమ్మ, యాదమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
