తండా గొంతు తడిపిన ఆపన్నహస్తం.. ఉప్పల వెంకటేష్ మానవీయ స్పందన

1001394406.jpg

కల్వకుర్తి నవంబర్ 24: తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఎల్లికట్ట తండా ప్రజలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ అండగా నిలిచారు.కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లికట్ట తండాలో మిషన్ భగీరథ నీరు సరిపడా సరఫరా కాకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన వెంటనే స్పందించారు.తండా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సుమారు రూ.లక్ష విలువైన బోరు మోటార్‌ను అందజేశారు.తాగునీటి సమస్య పరిష్కారానికి సకాలంలో స్పందించి సహాయం అందించిన ఉప్పల వెంకటేష్‌కు తండా గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

You may also like...