Category: జిల్లా వార్తలు

నాచారంలో ఘోర రోడ్డు ప్రమాదం..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: నగరంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఢీకొన్న తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి...

పొద్దటూరులో ఇందిరమ్మ ఇంటికి గృహప్రవేశం

శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పొద్దటూరు గ్రామంలోని 3వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులైన సందపేట నరేష్–మమత దంపతులు నేడు తమ నూతన గృహంలో గృహప్రవేశం నిర్వహించారు.ఈ సందర్భంగా 3వ వార్డు మాజీ సభ్యుడు చాకలి రాములు మాట్లాడుతూ.. తాను వార్డు సభ్యుడిగా పనిచేసిన...

కేటీఆర్ హరీష్ రావు ,లకు. దీపావళి శుభాకాంక్షలు

కేటీఆర్, హరీష్ రావులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గార్లను కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, యువనేత డాక్టర్ జి. విశ్వతేజ రావు మర్యాదపూర్వకంగా వారి నివాసాల్లో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు….

ఫిట్స్ వచ్చిన యువకుడిని కాపాడిన కానిస్టేబుల్ రమేష్

మానవత్వం చాటుకున్న జీడిమెట్ల పోలీస్ కానిస్టేబుల్ రమేష్జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రమేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. సుభాష్‌నగర్ వీధిలో రోడ్డుపై గుర్తుతెలియని ఓ యువకుడు ఫిట్స్ వచ్చి పడిపోగా, సరిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కానిస్టేబుల్ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని, అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి సహాయం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం…

ఎంఆర్‌పీ దాటితే కఠిన చర్యలు

  బియ్యం ధరలపై ప్రభుత్వం నియంత్రణ.. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించేది లేదుబ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై నిఘా.. పునరావృతమైతే పీడీ యాక్ట్ ప్రయోగంబిపిటి, కేఎన్‌ఎం కిలో రూ.66.. తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74.. హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79 గరిష్ట ధర**హైదరాబాద్:** రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ వస్తున్న వార్తలు, మార్కెట్లో అకారణంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బియ్యం వ్యాపారంలో కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల…

రంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ బలవన్మరణం!

రంగారెడ్డి,వెబ్ డెస్క్: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడలో 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీను (31) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వివిధ ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల...

యాదవుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి, ప్రతీక సదర్ ఉత్సవం

యాదవుల సంస్కృతి, ఐక్యతకు ప్రతీక సదర్ ఉత్సవాలుముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగంమూసాపేట్: యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అన్నారు.మూసాపేట్ యాదవ సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు….

ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి సంబరాలు లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ చింతలగట్టు శివరాజ్

Iసంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ సొంతింట్లో తొలి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వారి ఇళ్ల ముందు దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సొంతింట్లో తొలి దీపావళి జరుపుకోవడం…

లగచర్లలో రైతన్నతో ఆత్మీయ సభ: సీఎం రేవంత్ రెడ్డి హాజరు..!

కొడంగల్,నవంబర్ 09:లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఆవరణలో ఏర్పాటు చేసిన రైతన్నతో ఆత్మీయ సభ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,…

అదనపు జలాల అనుసంధానం పూర్తి చేయాలి ఎండి అశోక్ రెడ్డి ఆదేశం

నవంబర్ 15లోగా గోదావరి అదనపు జలాల అనుసంధాన పనులు పూర్తి చేయాలి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి అదనపు జలాలను నగరానికి తరలించే పనులను వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో సింగూరు–మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)…