వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, రుణాలు మంజూరు చేయాలి

ప్రతి వార్డులో వెండింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు

గాజులరామారం: గాజులరామారం సర్కిల్ కార్యాలయంలో సోమవారం టౌన్ వెండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వెంకట రాములు మాట్లాడుతూ, సర్కిల్ పరిధిలో కొత్తగా వీధి వ్యాపారులను గుర్తించి, అర్హులైన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే అర్హత కలిగిన వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ప్రధానమంత్రి స్వనిధి (PM SVANidhi) పథకం ద్వారా రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి వార్డులో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారులకు మెరుగైన జీవనోపాధి కల్పించడంతో పాటు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా క్రమబద్ధమైన వ్యాపార నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో ఏసీపీ శ్రీమతి సుమిత్ర, డిప్యూటీ ఇంజనీర్ (ఎస్‌డబ్ల్యూఎం) నిఖిల్ రెడ్డి, గుడ్ మార్నింగ్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ప్రతినిధి మురళీధర్, టీఎల్ఎఫ్ అధ్యక్షుడు దేవకరణ, యూసీడీసీఓ సాయి కృష్ణ, సంబంధిత అధికారులు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.

You may also like...