ప్రతి దుకాణానికి గ్రామపంచాయతీ వ్యాపార లైసెన్స్ తప్పనిసరి

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కొల్లూరు గ్రామంలోని చిరు వ్యాపారుల యజమానులతో గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శివరాజ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి దుకాణం యజమాని తప్పనిసరిగా గ్రామ పంచాయతీ నుంచి వ్యాపార లైసెన్స్ పొందాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం తదితర మత్తు పదార్థాలను విక్రయించరాదని స్పష్టం చేశారు.
గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ గ్రామసభల్లో చేసిన తీర్మానాలకు అనుగుణంగా వ్యాపారులు నిబంధనలు పాటిస్తూ సహకరించాలని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

You may also like...