కేటీఆర్ చేతుల మీదుగా భాస్కర్ రావుకు ఘన సన్మానం..! జన్మదిన వేడుకలో సందడి..!

1001347634.jpg

కల్వకుర్తి /హైదరాబాద్ నవంబర్ 10 :బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వెల్దండ మండల సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి భాస్కరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా భాస్కరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిబద్ధతతో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ నాయకులలో భాస్కరరావు ఒకరని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని, ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో మరింత ముందుకు పోతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం అని కేటీఆర్ స్పష్టం చేశారు.ఈ జన్మదిన వేడుకలలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి*తదితరులు పాల్గొన్నారు.

You may also like...