పట్టభద్రుల గొంతుకనవుతా.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి – కేటీఆర్ కు ఎల్ ఎన్ రెడ్డి విజ్ఞప్తి
- రావిరాల ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక బస్సులు నడపాలి.! - November 10, 2026
- తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ .! - November 10, 2026
- పట్టభద్రుల గొంతుకనవుతా.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి – కేటీఆర్ కు ఎల్ ఎన్ రెడ్డి విజ్ఞప్తి - November 10, 2026

కల్వకుర్తి: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, సర్పంచిగా, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవాన్ని కేటీఆర్‌కు వివరించారు. అవకాశం కల్పిస్తే పట్టభద్రులు, నిరుద్యోగ యువత సమస్యలపై పోరాడటంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని లక్ష్మీ నర్సింహ రెడ్డి తెలిపారు.
