తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ .!
- రావిరాల ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక బస్సులు నడపాలి.! - November 10, 2026
- తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌తో గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ .! - November 10, 2026
- పట్టభద్రుల గొంతుకనవుతా.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి – కేటీఆర్ కు ఎల్ ఎన్ రెడ్డి విజ్ఞప్తి - November 10, 2026

కల్వకుర్తి సమస్యలపై చర్చ.. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు విజయవంతం చేయాలని కేటీఆర్ సూచన
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని గోలి శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. ఈ భేటీలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు.కార్యక్రమంలో కల్వకుర్తి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు సుభాష్, బుచ్చిబాబు, బుజ్జి, శేఖర్‌తో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
