రావిరాల ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక బస్సులు నడపాలి.!
- రావిరాల ఎల్లమ్మ ఆలయానికి ప్రత్యేక బస్సులు నడపాలి.! - November 10, 2026
- తెలంగాణ భవన్లో కేటీఆర్‌తో గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ .! - November 10, 2026
- పట్టభద్రుల గొంతుకనవుతా.. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వండి – కేటీఆర్ కు ఎల్ ఎన్ రెడ్డి విజ్ఞప్తి - November 10, 2026

కల్వకుర్తి, నవంబర్ 10: కల్వకుర్తి బస్ డిపో నుంచి వెల్దండ, ఆమనగల్ మండలాల మీదుగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయానికి ప్రతి మంగళవారం ప్రత్యేక బస్సులు నడపాలని మహిళా భక్తులు విజ్ఞప్తి చేశారు. బస్సుల కొరతతో దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయంపై డిపో మేనేజర్ శాలినిని సంప్రదించగా, త్వరలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు భక్తులు పేర్కొన్నారు.
