రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) మేడ్చల్–మల్కాజిగిరి, డంప్యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. డంప్యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన, వాయు కాలుష్యం కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం పడుతోందని, ఈ సమస్యను ఇకనైనా పరిష్కరించాలని కోరారు.
గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీసీసీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలవగా, రెండు నెలల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని తెలిపారు.
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డాక్టర్ బి. శంకర్ నారాయణన్, కో-కన్వీనర్లు కె. పద్మాచారి, ఎం. సమ్మిరెడ్డి, ఎ. సంజీవరెడ్డి, జి. స్వర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు.
