Category: జిల్లా వార్తలు

నూతన పాలకవర్గానికి వస్పుల శ్రీశైలం ఘన స్వాగతం.!

ఆమనగల్ నవంబర్ 13 : ఆమనగల్ మార్కెట్ యార్డులో సింగిల్ విండో చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ కాలే మల్లయ్యలను మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి, సహకార రంగ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సీఈవో పద్మాకర్ రెడ్డి, నరసింహ, వెంకటేష్, దేవేందర్, వినోద్, దేవరశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు

వాజేడు: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాజేడు నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు సోయం ఆనందరావు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమకు నచ్చిన రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యాదవుల సంప్రదాయానికి ప్రతీక సదర్ ఉత్సవాలు – సర్పంచ్ కొండల్ యాదవ్.!

వెల్దండ నవంబర్ 13: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో యాదవ సంఘం పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో యాదవులు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

జహీరాబాద్ చెరుకు రైతులకు టన్నుకు రూ 5000 మద్దతు మద్దతు ధరపై హామీ!

జహీరాబాద్తె లంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు త్వరలోనే ప్రభుత్వం నుంచి తీపి కబురు అందనుంది. చెరుకు మద్దతు ధరను టన్నుకు రూ. 5000/- గా నిర్ణయించాలని కోరుతూ జహీరాబాద్‌ రైతుల బృందం సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కేన్ కమిషనర్ నర్సిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న సాగు ఖర్చులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వారు కమిషనర్…

ములుగు జిల్లా తుడుందెబ్బ అధ్యక్షులుగా సర్వేశ్వరరావు

ములుగు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ములుగు జిల్లా నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు ఉపేందర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం తుడుం దెబ్బ కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.నూతన జిల్లా అధ్యక్షుడిగా సిద్ధబోయిన సర్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా వట్టం సురేష్‌తో పాటు ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివాసీల సమస్యల…

దుండిగల్ సర్కిల్లో విస్తృత తనిఖీలు

 దుండిగల్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జోనల్ కమిషనర్ శుక్రవారం విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ (డీసీ), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ), ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుండిగల్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతున్న నిర్మాణ, మౌలిక వసతుల పనులను పరిశీలించి, వాటి పురోగతి, గడువులపై సమీక్షించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని…

మహేష్ భౌతికకాయానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు

త్రిపురారం: మండల కేంద్రానికి చెందిన పర్వతం మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో బుధవారం బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహేష్ అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బైరాం కృష్ణ, అనుముల శ్యాంసుందర్ రెడ్డి, జంగిలి రామలింగయ్య, అవిరెండ్ల సైదులు, తాటికొండ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

త్రిపురారం: మండల కేంద్రానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అలంపల్లి జానయ్య ఆయన కుటుంబాన్ని పరామర్శించి, మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు అనుముల అనంత్ రెడ్డి, కసిరెడ్డి నరేష్, పీబీ రవి, గోపు శ్యామ్ సుందర్ రెడ్డి, మట్టయ్య, తిరుపతి, బాలయ్య, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

నన్నపనేని నరేందర్ వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

ములుగు: వరంగల్ మహానగర పాలక సంస్థ తొలి మేయర్, వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన కుమారుడు లోకేష్ పటేల్ వివాహ ఆహ్వాన పత్రికను ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకుడు ముంజల భిక్షపతి గౌడ్‌కు అందజేశారు. లోకేష్ పటేల్, నిక్షిత రావు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు.