విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు
- విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ప్రధానోపాధ్యాయుడు ఆనందరావు - November 13, 2026
- ములుగు జిల్లా తుడుందెబ్బ అధ్యక్షులుగా సర్వేశ్వరరావు - November 13, 2026
- నన్నపనేని నరేందర్ వివాహ ఆహ్వాన పత్రిక అందజేత - November 13, 2026
వాజేడు: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాజేడు నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం నెహ్రూ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయుడు సోయం ఆనందరావు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తమకు నచ్చిన రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
