మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
- మహేష్ భౌతికకాయానికి బీఆర్ఎస్ నాయకుల నివాళులు - November 13, 2026
- మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు - November 13, 2026
- రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - November 12, 2026
త్రిపురారం: మండల కేంద్రానికి చెందిన పర్వతం అంజయ్య కుమారుడు మహేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అలంపల్లి జానయ్య ఆయన కుటుంబాన్ని పరామర్శించి, మహేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు అనుముల అనంత్ రెడ్డి, కసిరెడ్డి నరేష్, పీబీ రవి, గోపు శ్యామ్ సుందర్ రెడ్డి, మట్టయ్య, తిరుపతి, బాలయ్య, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

