Author: Ananth thippanapalli

ఏటూరునాగారంలో అభివృద్ధి పనులు ప్రారంభం

ఏటూరునాగారం, నవంబర్ 12: ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులను సర్పంచ్ కాకులమర్రి శ్రీలత గురువారం ప్రారంభించారు.వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణతో పాటు 10, 12, 14వ వార్డుల్లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే గోశాలలో పశువుల కోసం నీటి తొట్టి, షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి…

చిన్నారులకు ఐరన్ సిరప్ పంపిణీ చేసిన సర్పంచ్ శ్రీలత

ఏటూరునాగారం: మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డు అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత సందర్శించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్య సేవలను పరిశీలించి, రక్తహీనత నివారణకు ఐరన్ సిరప్ పంపిణీ చేశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అర్హులందరికీ పౌష్టికాహారం, మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వార్డు సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలో రేపు విద్యుత్ అంతరాయం

వాజేడు: చీకుపల్లి సమీపంలో ధర్మవరం 33 కేవీ విద్యుత్ లైన్ రోడ్డు క్రాసింగ్, చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో గురువారం (12-11-2026) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ధర్మవరం సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.అంతరాయం కలిగే సమయంలో రైతులకు నిలిచిపోయిన మూడు ఫేజ్‌ల విద్యుత్‌ను రాత్రి సమయంలో తిరిగి సరఫరా చేయనున్నట్లు వాజేడు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.

ములుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం

ములుగు: ములుగు జిల్లాలో ఓ దివ్యాంగ మహిళపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం ఇంట్లో ఉన్న రూ.4 వేల నగదును కూడా నిందితుడు అపహరించినట్లు తెలిపారు. బాధితురాలి గుర్తింపు, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై వెంకటేశ్ వెల్లడించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

రవిచందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ములుగు: పుట్టినరోజు సందర్భంగా దివంగత కాంగ్రెస్ నేత నల్లెల్ల కుమారస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి రవిచందర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుడుంబా స్తావారాలపై పోలీసుల దాడులు

వెంకటాపురం: నిషేధిత గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూగూరు వెంకటాపురం సీఐ ముత్యం రమేష్ నేతృత్వంలో వెంకటాపురం మండలం రామచంద్రపురం గ్రామ శివారులోని మూడు ప్రాంతాల్లో సోమవారం ఉదయం తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9,600 లీటర్ల బెల్లం వాష్‌ను ధ్వంసం చేశారు. 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్సైలు తిరుపతి రావు, తిరుపతి రెడ్డి, పోలీస్…