యాదవుల సంప్రదాయానికి ప్రతీక సదర్ ఉత్సవాలు – సర్పంచ్ కొండల్ యాదవ్.!
- పోతేపల్లిలో ఘనంగా యాదవుల సదర్ ఉత్సవాలు.! - November 13, 2026
- వింటేజ్ కాఫీ కంపెనీపై ఆరోపణలు అవాస్తవం.! - November 13, 2026
- నూతన పాలకవర్గానికి వస్పుల శ్రీశైలం ఘన స్వాగతం.! - November 13, 2026

వెల్దండ నవంబర్ 13: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామంలో యాదవుల ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో యాదవ సంఘం పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల ఐక్యత, ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని, వాటిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో యాదవులు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
