Category: జిల్లా వార్తలు

ఒంకార్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలిజహిరాబాద్ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్: కొత్తపూర్-బి గ్రామంలోని ఒంకార్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఫ్యాక్టరీని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఫ్యాక్టరీ ప్రారంభంలో జాప్యం జరిగితే చెరకు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి చెరకు క్రషింగ్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, చెరకు రైతులు పాల్గొన్నారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు.. గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ప్రసాద్ గౌడ్

వెల్దండ నవంబర్ 14:పార్టీలకతీతంగా గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.గ్రామంలో ఇప్పటికే 18 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, శనివారం మరో 28 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు…

కత్తులతో దాడి ఏడుగురు అరెస్ట్

జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బోయి కిషన్‌ (44)పై కత్తులతో దాడి చేసిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో కార్యాలయంలో ఉన్న కిషన్‌పై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పాత విభేదాలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్యకు…

అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం: సర్పంచ్ గన్యా నాయక్

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 14: కల్వకుర్తి నియోజకవర్గంలోని కుందారం తండా గ్రామపంచాయతీకి 11 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గన్యా నాయక్ లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో అర్హులకు పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పేదల సంక్షేమం, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

యాదవ సాంస్కృతి సంప్రదాయానికి ప్రతిక సదర్ సమ్మేళనం

 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం సదర్ సమ్మేళన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరేకపూడి గాంధీ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్‌లతో కలిసి మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరయ్యారు. యాదవుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా…

టీఆర్ఎస్‌లో చేరిన శెట్పల్లి సంగారెడ్డి యువ నాయకులు

ఎల్లారెడ్డి నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఇంచార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో లింగంపేట్ మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన యువ నాయకులు మున్నూరి సాయిబాబా, పెద్ద విఠల్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు…