యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేశాకే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగుపెట్టాలి

WhatsApp Image 2026-11-14 at 19.45.28.jpeg

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేసిన తర్వాతే రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించాలని బీజేవైఎం జనగామ జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల భృతి, ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ విడుదల వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు

You may also like...