Category: జిల్లా వార్తలు

మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ!

కల్వకుర్తి నవంబర్ 14 : పురుషాధిక్య సమాజంలో మహిళలకు సముచిత గౌరవం, ప్రాధాన్యత లభించడం లేదనే విమర్శలకు కల్వకుర్తిలో జరిగిన ఓ ఘటన అద్దం పడుతోంది.శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కుర్చీలు సరిపడా ఏర్పాటు చేయకపోవడంతో పలువురు మహిళలు నేలపైనే కూర్చోవాల్సి వచ్చింది.ఒకవైపు ప్రజాప్రతినిధులు, పురుషులకు కుర్చీలు ఏర్పాటు చేయగా.. మహిళలు మాత్రం నేలపై కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మహిళలకు కనీస సౌకర్యాలు…

బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన

జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని సి హాస్టల్‌లో బాలల హక్కులు, విధులు, బాధ్యతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ మంచాల రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే చదువుపై శ్రద్ధ చూపి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, వైద్యం, న్యాయ సేవల గురించి…

కమాండోల శిక్షణకు OODA షూట్ హౌస్ ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

రాజేంద్రనగర్‌లోని గ్రేహౌండ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ OODA షూట్ హౌస్ (CQB ఫైరింగ్ రేంజ్)ను ప్రారంభించారు. పోలీసు అమరవీరులు సందీప్, పవన్, శ్రీధర్‌ల స్మారకార్థం ఈ శిక్షణ కేంద్రానికి వారి పేర్లను అనుసంధానించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కమాండోల గురి, పోరాట సంసిద్ధత పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఫిబ్రవరి 2 నుంచి రాజస్థాన్‌లో జరిగే అఖిల భారత పోలీస్ కమాండో పోటీల్లో నాలుగో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర కఠోర శిక్షణతో…

చెరువు హద్దులపై హైకోర్టు కీలక ఆదేశాలు

కుత్బుల్లాపూర్, బాచుపల్లి కోమటికుంట చెరువు (లేక్ ఐడీ: 2822) ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ హద్దుల నిర్ధారణకు పది రోజుల్లో భూ రికార్డులు సమర్పించాలని HMDA, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 11-11-2026న C.C.No.1690 of 2026 విచారణ సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. వాసవి ఇన్‌ఫ్రా 8, 9 బ్లాకుల ఆక్రమణ ఆరోపణలపై పిటిషనర్ ఆకుల సతీష్ దాఖలు చేసిన కేసులో అసలు ప్రభుత్వ రికార్డులతో…

రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలించిన డిసిపి లక్ష్మి

జీరో ఫాటాలిటీ డిస్ట్రిక్ట్ (ZFD) కార్యక్రమంలో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ రోడ్డు, చెర్లపల్లి బస్‌స్టాండ్ జంక్షన్ వద్ద ప్రమాదకర ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. రోడ్ సేఫ్టీ డీసీపీ ఏ. లక్ష్మి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్, ఆర్టీఏ, మున్సిపల్, రోడ్డు భద్రతా విభాగాల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. రహదారుల విస్తరణ, ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు, ఆక్రమణల తొలగింపు, జంక్షన్ల అభివృద్ధి, పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను గుర్తించారు. సంబంధిత శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను…

వివాదాస్పద భూవిక్రయాల మోసం.. వ్యక్తిపై పీడీ యాక్ట్

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూముల విక్రయాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై పంజాల జైహింద్ గౌడ్ (63)పై పోలీసులు 2026 నవంబర్ 13న పీడీ యాక్ట్ ప్రయోగించారు. రాంపల్లిలో వివాదాస్పద భూమిలో అక్రమ లేఅవుట్ ఏర్పాటు చేసి, హక్కులు సక్రమంగా ఉన్నాయని నమ్మించి ప్లాట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో 2026లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయనను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. భూములు కొనుగోలు…

దీపావళి చోరీలు,నలుగురు అరెస్ట్‌.. రూ.50 లక్షల స్వాధీనం

వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు ఇళ్ల దొంగతనాలకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 21 తులాల బంగారం, 15 గ్రాముల వజ్రాలు, 54 తులాల వెండి ఆభరణాలు, రూ.9 లక్షల నగదు కలిపి సుమారు రూ.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సచివాలయ నగర్‌లో దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఐదు సెల్‌ఫోన్లు, బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.!

కల్వకుర్తి నవంబర్ 14:ఎంతోకాలంగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు కల్వకుర్తి నియోజకవర్గంలో పింఛన్ల పండుగ మొదలైంది.నూతనంగా మంజూరైన పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గీత కార్మికులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన పలువురికి…

చిరాగ్‌పల్లి: బస్సు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

చిరాగ్‌పల్లి: బస్సు ప్రమాదంలో ముగ్గురికి గాయాలుచిరాగ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బసవకల్యాణ్ వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు హైవేపై వస్తున్న వాటర్ ట్యాంకర్‌ను పక్కవైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతినగా, మహారాష్ట్రకు చెందిన సాద్ అఫ్సాద్ (12), అజీర్, ముబీనా అఫ్సాద్ షేక్ స్వల్పంగా గాయపడ్డారు.