అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం: సర్పంచ్ గన్యా నాయక్

1001361666.jpg

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 14: కల్వకుర్తి నియోజకవర్గంలోని కుందారం తండా గ్రామపంచాయతీకి 11 కొత్త పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గన్యా నాయక్ లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో అర్హులకు పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పేదల సంక్షేమం, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పింఛన్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.

You may also like...