పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు.. గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ప్రసాద్ గౌడ్
- మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ! - November 14, 2026
- పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.! - November 14, 2026
- పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు.. గ్రామాభివృద్ధే లక్ష్యం: సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - November 14, 2026

వెల్దండ నవంబర్ 14:పార్టీలకతీతంగా గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.గ్రామంలో ఇప్పటికే 18 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, శనివారం మరో 28 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు. గ్రామంలో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో ప్రాధాన్యత క్రమంలో గ్రామంలోని ఇతర అభివృద్ధి పనులను కూడా చేపడతామని పేర్కొన్నారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయించామని తెలిపారు.ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని సర్పంచ్ ప్రసాద్ గౌడ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు బ్రహ్మచారి, శ్యామ్, శేఖర్, పలువురు కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
