కత్తులతో దాడి ఏడుగురు అరెస్ట్

  • జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బోయి కిషన్‌ (44)పై కత్తులతో దాడి చేసిన కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి 12.55 గంటల సమయంలో కార్యాలయంలో ఉన్న కిషన్‌పై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పాత విభేదాలు, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రూ.10 లక్షల సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు ప్రెస్‌నోట్‌ పేర్కొంది. నిందితుల నుంచి రెండు కత్తులు, ఒక సుత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

You may also like...