Author: PAKADI RAMANJANEYULU

రీ సర్వే పక్కాగా నిర్వహించాలి – అదనపు కలెక్టర్ చెన్నయ్య

వెల్దండ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ రీ-సర్వే పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని పైలట్ గ్రామమైన లింగారెడ్డిపల్లిలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును పరిశీలించిన అదనపు కలెక్టర్.. భూ సర్వేలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పూర్తి కచ్చితత్వంతో పనులు చేపట్టాలని సర్వేయర్లకు సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి రీ-సర్వేపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు….

భూవివాదంపై న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కు వినతి

తలకొండపల్లి:రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో భూ వివాదం పరిష్కరించాలని కోరుతూ అంపటి సత్తయ్య కుటుంబ సభ్యులు ఎమ్మార్వో రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.సర్వే నంబర్‌ 4లోని మూడున్నర కుంటల భూమిని గత 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, అయితే ఆ భూమి విషయంలో రిజిస్ట్రేషన్‌ వివాదం తలెత్తిందని సత్తయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు పుల్లారెడ్డి దశరథం పేరుతో భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిందని,ఈ వ్యవహారంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ వివాదం…

కాన్సిరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలి… ఎట్టి ఆంజనేయులు

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ కాన్షీరాం వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. కాన్షీరాం ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని కల్వకుర్తి అసెంబ్లీ ఇన్చార్జి ఎట్టి ఆంజనేయులు పిలుపునిచ్చారు.పార్టీ శ్రేణులతో హైదరాబాద్ లో జరగనున్న బీఏఎమ్సీఈఎఫ్ డీఎస్ – 4 బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షిరాం 20వ వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు తరలివెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ…

నాగర్ కర్నూల్ లో ఈ నెల 14న ఉచిత కంటి వైద్య శిబిరం

నాగర్‌కర్నూల్: జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14న బుధవారం ఉదయం 9 గంటలకు నాగర్‌కర్నూల్‌లోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డులో ఉన్న శోభ ఆప్టికల్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు విశ్రాంత నేత్ర వైద్యాధికారి బి. శివారెడ్డి తెలిపారు. శిబిరంలో పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లకు అర్హులైన వారికి ఎనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు. శిబిరానికి వచ్చేవారు ఆధార్, ఓటరు లేదా రేషన్ కార్డు…

పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి

గుండాల–పోతేపల్లి బీటీ రోడ్డు నిర్మాణానికి వినతిఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సానుకూల స్పందనవెల్దండ: గుండాల నుంచి పోతేపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు అల్లం తోట బావి తండాలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు.వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు చేపట్టాలని సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బాణావత్ శంకర్ నాయక్, అల్లం తోట బావి తండా సర్పంచ్ సరోజ, అరుణ్…

విద్యుత్ కోతలపై చంద్రధన రైతుల నిరసన

తలకొండపల్లి,అక్టోబర్ 9: విద్యుత్ కోతలతో వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామ రైతులు సబ్‌స్టేషన్‌ వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. పురుగుమందు బాటిళ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, విద్యుత్ కోతలు మరింత నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్జాల్ సబ్‌స్టేషన్‌ నుంచి చంద్రధన సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ సరఫరా…

డొంకి చంద్రమౌళి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామానికి చెందిన డొంకి చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరిశెట్టి శివ, ఉడుత శివతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు గోలి ఆర్థిక సహాయం అందజేత

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండలంలోని పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలకు అంజి మాస్టర్ అండగా నిలిచారు.తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మృతుల కుటుంబాలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.పోతేపల్లి గ్రామానికి చెందిన డెంకి చంద్రమౌళి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న అంజి మాస్టర్,…

ఘనంగా కరీం భాయ్ బామ్మర్దుల రిసెప్షన్ వేడుక

ఆమనగల్:పట్టణానికి చెందిన ప్రముఖ స్క్రాప్ వ్యాపారవేత్త కరీం భాయ్ బామ్మర్దుల వివాహ రిసెప్షన్ వేడుకను షాద్‌నగర్‌లోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకుడు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు పాపిశెట్టి రామన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి ‘షాదీ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించి…